Wednesday, April 15, 2009

మాటలాడవచ్చు మనసుదెల్పఁగలేడు
తెలుపవచ్చుఁదన్ను తెలియలేడు
సురియబట్టవచ్చు శూరుడు కాలేడు
విశ్వదాభిరామ వినురవేమ


mAtalAdavachchu manasudhelpagalEdu
thelupavachchu dhannu theliyalEdu
suriyabattavachchu shUrudu kAlEdu
vishvadhAbhirAma vinuravEma


శాంతమె జనులను జయమునొందించును
శాంతముననె గురుని జాడ తెలియు
శాంత భావమహిమ జర్చించలేమయా
విశ్వదాభిరామ వినురవేమ


shAMthame janulanu jayamunoMdhiMchunu
shAMthamunane guruni jAda theliyu
shAMtha bhAvamahima jarchiMchalEmayA
vishvadhAbhirAma vinuravEma


చంపగూడదెట్టి జంతువునైనను
చంపవలయు లోక శత్రుగుణము
తేలుకొండిఁగొట్టఁ దేలేమి చేయురా
విశ్వదాభిరామ వినురవేమ

chaMpagUdadhetti jaMthuvunainanu
chaMpavalayu loaka shathruguNamu
thElukoMdiAOgottaAO dhElEmi chEyurA
vishvadhAbhirAma vinuravEma


ఆత్మయందె ద్రుష్టి ననువుగా నొనరించి
నిశ్చలముగ ద్రుష్టి నిలిపెనేని
అతడునీవె సుమ్మి యనుమానమేలరా
విశ్వదాభిరామ వినురవేమ

AthmayaMdhe dhruShti nanuvugA nonariMchi
nishchalamuga dhruShti nilipenEni
athaduneeve summi yanumAnamElarA
vishvadhAbhirAma vinuravEma
ఇమ్ము దప్పువేళ
నెమ్మెలన్నియుమాని
కాలమొక్కరీలతి గడప వలయు
విజయు డిమ్ము దప్పి విరటుని గొల్వడా
విశ్వదాభిరామ వినురవేమ

immu dhappuvELa
nemmelanniyumAni
kAlamokkareelathi gadapa valayu
vijayu dimmu dhappi viratuni golvadA
vishvadhAbhirAma vinuravEma

చదివి చదివి కొంత చదువంగ చదువంగ
చదువు చదివి యింకఁ జదువు చదివి
చదువు మర్మములను చదువలేడయ్యెను
విశ్వదాభిరామ వినురవేమ

chadhivi chadhivi koMtha chadhuvaMga
chadhuvaMgachadhuvu chadhivi yiMka jadhuvu chadhivic
hadhuvu marmamulanu chadhuvalEdayyenu
vishvadhAbhirAma vinuravEma

అంతరంగమందు నపరాధములు చేసి
మంచి వానివలెనె మనజుడుండు
ఇతరులెఱుగకున్న నీశ్వరుడెఱుగడా?
విశ్వదాభిరామ వినురవేమ

aMtharaMgamaMdhu naparADhamulu chEsi
maMchi vAnivalene manajuduMdu
itharuleRugakunna neeshvarudeRugadA?
vishvadhAbhirAma vinuravEma

Monday, April 13, 2009

చంపదగినయట్టి శత్రువు తనచేతఁ
జిక్కెనేని గీడు సేయరాదు
పొసగ మేలుచేసి పొమ్మనుటే చాలు
విశ్వదాభిరామ వినురవేమ

chaMpadhaginayatti shathruvu thanachEtha
jikkenEni geedu sEyarAdhu
posaga mEluchEsi pommanutE chAlu
vishvadhABhirAma vinuravEma

ధనముగూడఁ బెట్టిదానంబు చేయక
తానుఁ దినక లెస్స దాచుకొనగ
తేనెనీగ కూర్చి తెరువరి కియ్యదా
విశ్వదాభిరామ వినురవేమ

Dhanamugooda bettidhAnaMbu chEyaka
thAnuAO dhinaka lessa dhAchukonaga
thEneneega kUrchi theruvari kiyyadhA
vishvadhABhirAma vinuravEma

Thursday, April 9, 2009

ఉప్పులేని కూర యొప్పదు రుచులకు
పప్పులేని తిండి ఫలములేదు
అప్పులేనివాడె యధిక సంపన్నుడు
విశ్వదాభిరామ వినురవేమ

uppulEni koora yoppadhu ruchulaku
pappulEni thiMdi phalamulEdhu
appulEnivAde yaDhika saMpannudu
vishvadhABhirAma vinuravEma

తప్పులెన్నువారు తండోప తండంబు
లుర్విజనులకెల్ల నుండు దప్పు
తప్పులెన్నువారు తమతప్పులెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ

thappulennuvAru thaMdoapa thaMdaMbu
lurvijanulakella nuMdu dhappu
thappulennuvAru thamathappulerugaru
vishvadhABhirAma vinuravEma

అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
దినగదినగ వేము తియ్యగనుండు
సాధనమునపనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ

anaga nanaga rAga mathishayilluchunuMdu
dhinagadhinaga vEmu thiyyaganuMdu
sADhanamunapanulu samakUru Dharaloana
vishvadhABhirAma vinuravEma
అన్నిదానములను నన్నదానమె గొప్ప
కన్నతల్లికంటె ఝనములేదు
ఎన్నగురునికన్న నెక్కుడు లేదయా
విశ్వదాభిరామ వినురవేమ

annidhAnamulanu nannadhAname goppa
kannathallikMte jhanamulEdhu
ennagurunikanna nekkudu lEdhayA
vishvadhABhirAma vinuravEma
నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు బట్టు
బయట గుక్కచేత భంగపడును
స్థానబలముగాని తన బలిమికాదయా
విశ్వదాభిరామ వినురవేమ

neeLLaloana mosali nigidi yEnugu battu
bayata gukkachEtha bhaMgapadunu
sThAnabalamugAni thana balimikAdhayA
vishvadhABhirAma vinuravEma
కోపమునను ఝనత కొంచమైపోవును
కోపమునను మిగుల గోడుఁ గల్గు
కోపమడచెనేని కోర్కెలీడేరు
విశ్వదాభిరామ వినురవేమ

koapamunanu jhanatha koMchamaipOvunu
koapamunanu migula goadu galgu
koapamadachenEni koarkeleedEru
vishvadhABhirAma vinuravEma
అల్పజాతి వాని కధికారమిచ్చిన
డొడ్డవారినెల్ల దొలగజేయు
జెప్పుందినెడికుక్క చెఱకుతీపెరుగునా?
విశ్వదాభిరామ వినురవేమ

alpajAthi vAni kaDhikAramichchina
doddavArinella dholagajEyu
jeppuMdhinedikukka cheRakutheeperugunA?
vishvadhABhirAma vinuravEma
వేరుపురుగుచేరి వ్రుక్షంబుజెఱచును
చీడ పురుగు జేరి చెట్టుఁ జెఱచుఁ
కుత్సితుండుచేరి గుణవంతుఁజెఱచురా
విశ్వదాభిరామ వినురవేమ

vErupuruguchEri vrukShaMbujeRachunu
cheeda purugu jEri chettu jeRachu
kuthsithuMduchEri guNavMthu jeRachurA
vishvadhABhirAma vinuravEma
ఆత్మశుధ్ధి లేని యాచారమదియేల?
భాండశుధ్ధి లేని పాకమేల?
చిత్తశుధ్ధి లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ


AthmashuDhDhi lEni yAchaaramadhiyEla?
bhAMdashuDhDhi lEni pAkamEla?
chiththashuDhDhi lEni shivapoojalElarA?
vishvadhABhirAma vinuravEma